రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

MBNR: శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.