'గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి'
KMM: గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో ఒకపూట పోషకాహారం తీసుకోవాలని సూపర్‌వైజర్ సూచించారు. మధిర-1 సెక్టార్ పరిధిలోని ఆర్సీఎం చర్చ్ రోడ్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఆరోగ్య లక్ష్మి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ రంగా రూప-శ్రీనివాస్ పాల్గొన్నారు.