ఆవుపై కత్తితో దాడి

ఆవుపై కత్తితో దాడి

ADB: తాంసి మండలం పొన్నారి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఆవు ఇద్దరు మహిళలను పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆవు దాడికి ఆగ్రహించిన అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో ఆవుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.