'బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి'

'బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి'

AKP: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యుడు లోవరాజు పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎస్ రాయవరం మండలం ఉప్పరాపల్లి జెడ్పీ హైస్కూల్లో సోమవారం పలు అంశాలపై అవగాహన కల్పించారు. బడి బయట ఉన్న పిల్లలందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.