హర్మూజ్ దాటాలంటే అనుమతి అక్కర్లేదు: భారత్

హర్మూజ్ దాటాలంటే అనుమతి అక్కర్లేదు: భారత్

హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానానికి ఏ దేశం నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇరాన్‌తో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుంటేనే భారత నౌకలకు ఆ దేశం అనుమతిస్తోందని వస్తోన్న వాదనలను ఖండించింది. హర్మూజ్ అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుందని, ఆ మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ ఉంటుందని జలమార్గాలశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్‌ తెలిపారు.