విషాదం.. వడదెబ్బతో వ్యక్తి మృతి
MLG: మంగపేట మండలం కమలాపురం పాతూరుకు చెందిన షేక్ మైబూబ్ (58) ఇవాళ వడదెబ్బతో మృతి చెందారు. తన ఇంటి పెరటిలో కూరగాయల సాగు పనులు చేసుకుంటుండగా, రెండు రోజులుగా మండలంలో ఉన్న ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్తుండగానే మృతి చెందారు. మైబూబ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కమలాపురం మాజీ ఎంపీటీసీ చింత సురేష్ కోరారు.