బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పీవీ ఫణికుమార్
కృష్ణా: బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం 45వ డివిజన్ ఇన్‌ఛార్జ్ పీవీ ఫణికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టిన పీవీ ఫణి కుమార్‌కు ఈ పదవి లభించిందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు.