పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి
VZM: దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు అందజేశారు. స్థానికులతో మాటామంతీ జరుపుతూ గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.