ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగేశ్వర్ నాయుడు

అన్నమయ్య: సంబేపల్లె మండలానికి చెందిన కందూరి నాగేశ్వర్ నాయుడు బీసీ కోటాలో టీడీపీ తరపున రాష్ట్ర ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మంగళవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పని చేసేవారికి గుర్తింపు ఉంటుందని, పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నట్టు తెలిపారు.