నేడు వర్ధన్నపేటలో మంత్రి పొంగులేటి పర్యటన
WGL: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు వర్ధన్నపేటకు రానున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో రూ. 5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు, రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైల్, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలో జరిగే సమావేశంలో మంత్రి పాల్గొంటారని స్థానిక ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.