'ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమిస్తాం'

'ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమిస్తాం'

ADB: పీఆర్టీయూ తెలంగాణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, వేతనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు.