నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కర్నూలు నగరంలో ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు తీగల ఆధునీకరణ పనుల్లో భాగంగా గాయత్రీ ఎస్టేట్స్, బిర్లా కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని వివరించారు.