సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపు
MNCL: కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ సీహెచ్పీలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని, సింగరేణికి ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.