గంగాలమ్మ ఆలయంలో చోరీ
E.G: గోకవరం ఊరు శివారున గంగాలమ్మ అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ముప్పావు కేజీ వెండిని దొంగిలించి, పక్కనే ఉన్న టీస్టాల్‌లో కూడా విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా ట్రైనీ ఎస్సే నాగమణి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.