VIDEO: మద్యం షాపు ఏర్పాటుకు నిరసనగా మహిళల ర్యాలీ

VIDEO: మద్యం షాపు ఏర్పాటుకు నిరసనగా మహిళల ర్యాలీ

PLD: సత్తెనపల్లిలోని గీతామాధురి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుపై ఆర్యవైశ్య సంఘం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వద్దు బాబోయ్ వద్దు మద్యం షాపు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. గత సంవత్సర కాలంగా వైన్ షాప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఈ విషయమై మాజీ మంత్రి కన్నాకి వినతి పత్రం అందించామని పేర్కొన్నారు. వైన్ షాప్ ఏర్పాటు పనులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.