లబ్ధీదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLG: దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 250 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 1.18 కోట్లు, అలాగే షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల కింద మంజూరైన రూ. 75 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.