భారీగా పొగ మంచు.. వాహనదారులు ఇబ్బంది

భారీగా పొగ మంచు.. వాహనదారులు ఇబ్బంది

VKB: పూడూర్ మండల పరిధిలో శనివారం ఉదయం భారీగా పొగ మంచు కురిసింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులు  ముందు నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బంది పడ్డారు. పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.