VIDEO: పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: రాజమండ్రిలోని 49వ డివిజన్ సింహాచల నగర్‌లో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 42.50 లక్షలతో పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. స్థానిక కాలనీ వాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.