హనుమాన్ రథయాత్ర ప్రారంభించిన హారీశ్ రావు
సిద్దిపేటలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన హనుమాన్ రథయాత్రను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రథాన్ని ప్రారంభించారు. రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భజనలు, నామస్మరణతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు.