మదనపల్లెలో పెట్రోల్ లీకేజీతో కారు దగ్ధం

మదనపల్లెలో పెట్రోల్ లీకేజీతో కారు దగ్ధం

అన్నమయ్య: మదనపల్లె సంగం ఫంక్షన్ హాలు ఎదుట ఆదివారం ఉదయం నిలిచున్న కారు ఒక్కసారిగా మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ వాహనం పూర్తిగా కాలిపోయింది. పెట్రోల్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.