శ్రీదేవి అమ్మవారికి ఆషాఢం సారె సమర్పణ

శ్రీదేవి అమ్మవారికి ఆషాఢం సారె సమర్పణ

కోనసీమ: అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారికి భక్తులు బుధవారం ఆషాడం సారెను సమర్పించారు. పట్టణానికి  చెందిన భక్తులు మేళతాళాలతో గరగ డాన్సులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చీరలు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకం వివిధ రకాల పండ్లు స్వీట్స్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆశెట్టి ఆదిబాబు, మామిడిపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.