వైసీపీ నాయకులపై పూల వర్షం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండల వైసీపీ కన్వీనర్‌గా పాలగుళ్ళ మల్లికార్జునరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సోమవారం స్థానిక చెరువు నుంచి బస్టాండ్ మీదుగా సభాస్థలికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో కార్యకర్తలు వైసీపీ నేతలపై పూల వర్షం కురిపించారు. జై జగన్ అనే నినాదంతో ఆ ప్రాంతం మారు మోగింది. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.