బూర్గంపాడు ఠాణాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బూర్గంపాడు ఠాణాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మేడ ప్రసాద్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. అలాగే వారి సిబ్బందితో గౌరవ వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని ఎస్సై తెలిపారు.