దొడ్డిగుంటలో జగనన్న ఆరోగ్య సురక్ష

దొడ్డిగుంటలో జగనన్న ఆరోగ్య సురక్ష

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పీహెచ్‌సి వైద్యాధికారి వేణు శ్రీలక్ష్మి సూచించారు. రంగంపేట మండలం దొడ్డిగుంటలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 478 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.