రాధాకృష్ణన్‌ను అభినందించిన మోదీ

రాధాకృష్ణన్‌ను అభినందించిన మోదీ

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఉపరాష్ట్రపతిగా NDA అభ్యర్థి ఎన్నికకావడంతో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్త ఉపరాష్ట్రపతితో కాసేపు ముచ్చటించారు. మోదీతో పాటు పలువురు నాయకులు కూడా రాధాకృష్ణన్‌ను అభినందించారు.