విద్యార్థులు ఎంత మంది గైర్హాజరు అంటే..!
NDL: నందికొట్కూరులో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షకు 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని మూడు కేంద్రాల్లో 785 మంది విద్యార్థులకు గాను 775 మంది హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురు, శ్రీనంది కళాశాలలో ఐదుగురు, విజ్ఞాన్ కళాశాలలో ఇద్దరు పరీక్షకు హాజరు కాలేదని వెల్లడించారు.