వ్యాధి సోకిన వీధి కుక్క కలకలం
కృష్ణా: గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామంలో వ్యాధి సోకిన వీధి కుక్క ఈరోజు సంచరించింది. ఎవరినైనా చూసినా అసహజంగా ప్రవర్తించడం, గట్టిగా మొరగడం చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకు తీవ్ర ఇన్ఫెక్షన్ లేదా రాబిస్ లక్షణాలు ఉండొచ్చని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కను పట్టుకొని, చికిత్సను అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.