వరంగల్ జలసిరి.. సాగుకు ప్రాణాధారమైన నదులు!
WGL: ఉమ్మడి జిల్లాలో గోదావరి ప్రధాన నది కాగా, ఇది తూర్పు సరిహద్దు వెంట ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదులతో త్రీవేణి సంగమం ఏర్పడుతుంది. మరోవైపు నర్సంపేటలో పుట్టిన మున్నేరు నది జిల్లా వ్యవసాయానికి కీలకం. వీటితో పాటు ఆకేరు, పాలేరు, వైరా, పాకేరు వంటి వాగులు తాగునీరు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. ఈ జలవనరులే జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి.