VIDEO: 'దేశాన్ని ఐక్యతా బంధంలోకి తీసుకుని వచ్చారు'
ASR: సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ ఉక్కు మనిషిగా పేరు పొందారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కొనియాడారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ గొప్ప నేత, ఉక్కు మనిషి పటేల్ 562 సంస్థానాలను ఏకం చేసి భారత దేశాన్ని ఐక్యతా బంధంలోకి తీసుకొచ్చారన్నారు.