అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేస్తే చర్యలు: ASP

ASF: అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ బుధవారం ప్రకటనలో హెచ్చరించారు. సామాన్యులతో పాటు అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల 15 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించి 10మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే దాడులు నిర్వహిస్తామన్నారు.