కూలిన మిద్దె.. ఇద్దరికి గాయాలు

కూలిన మిద్దె.. ఇద్దరికి గాయాలు

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సంతపేటలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. పాత మట్టిమిద్దె అకస్మాత్తుగా కూలిపోవడంతో వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ధైర్యంగా ముందుకు వచ్చి శిథిలాలను తొలగించి వృద్ధులను సురక్షితంగా బయటకు తీశారు.