శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

RR: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 13.3 కిలోల గంజాయిని DRI అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో ఎయిర్ వేస్‌లో వచ్చిన ఓ మహిళ వద్ద ఈ గంజాయిని వారు గుర్తించారు. అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.