స్వామివారికి ఒకేసారి 70 వేల బోనాల సమర్పణ
JGL: పెద్దాపూర్లో శ్రీ మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. నేడు సుమారు 70 వేల మంది భక్తులు ఒకేసారి స్వామివారికి బోనాలు సమర్పించనునట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ అపూర్వ ఘట్టం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.