ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ
NRML: జిల్లాలో 47 మద్యం దుకాణాలకు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ అబ్దుల్ రజాక్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు మొత్తం 991 దరఖాస్తులు వచ్చాయని చివరి ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈనెల 27న మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.