ప్రజల యోగక్షేమమే కూటమి లక్ష్యం: తంగిరాల

NTR: చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యర్రగొర్ల వెంకటేశ్వరమ్మ పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా..ఈ విషయంపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే 60 వేల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు పత్రాన్ని గురువారం నాడు అందజేశారు. ప్రజల యోగక్షేమమే కూటమి లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.