ఆపన్న హస్తం అందించిన నారా లోకేశ్

ఆపన్న హస్తం అందించిన నారా లోకేశ్

ATP: అనంతపురానికి చెందిన సురేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించారు. బాధితుడు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్‌తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా, వైద్య ఖర్చుల కోసం ఇబ్బందుల్లో ఉన్న విషయం లోకేశ్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన లోకేశ్, తమ టీమ్ బాధితుడికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.