నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్

NLR: నెల్లూరు భక్తవత్సలనగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న నర్సింగ్ విద్యార్థిని అదృశ్యమైంది. ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని నాలుగో తేదీ హాస్టల్ నుంచి వెళ్లి తిరిగి రాలేదు. హాస్టల్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో వేదాయపాలెం పోలీసులకు వార్డెన్ ఫిర్యాదు చేశారు.