నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 33/11 కేవి జంగేడు సబ్ స్టేషన్‌లో 11 కేవి షిఫ్టింగ్ పనులు బుధవారం చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. షిఫ్టింగ్ పనుల కారణంగా ఫకీర్ గడ్డి, ఆకుదారివాడ, కాకతీయకాలని, వేశాలపల్లి, భాస్కరగడ్డ, పెద్దకుంటపల్లి, మల్లంపల్లి, కమలాపూర్ గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.