'రెండు నెలల్లో చెరువుల అభివృద్ధి పూర్తి చేయాలి'
HYD: మాధాపూర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువులను పరిశీలించారు. చెరువుల అభివృద్ధి పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సరస్సులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని హితవు పలికారు. చెరువుల చెంత ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు.