పుంగనూరు వద్ద ఇద్దరు అరెస్ట్
CTR: పుంగనూరు పట్టణం వనమలదీన్నే క్రాస్ వద్ద సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, SS.పేటకు చెందిన అబ్రార్, మునిరాజ పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కర్ణాటక అక్రమ మద్యం 120 టెట్రా ప్యాకెట్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. CI.సుబ్బరాయుడు నిందితులను రిమాండ్‌కు తరలించారు.