VIDEO: సత్తెనపల్లిలో కిడ్నాప్ కలకలం

పల్నాడు: నగదు చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం చివరకు కిడ్నాప్‌కు దారితీసింది. బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం వద్ద ఇంటికి తిరిగి వెళ్తున్న మస్తాన్ వలిని ప్రకాష్ వర్గీయులు అపహరించారు. బుధవారం వారి చెర నుంచి తప్పించుకున్న మస్తాన్ వలి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.