VIDEO: RTC బస్సు ఢీ కొని వృద్ధురాలు మృతి

WGL: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో తులా యాకమ్మ అనే వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకమ్మ జాతీయ రహదారి దాడుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.