వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

MBNR: కోయిలకొండ మండలం ఆచార్యపూర్ గ్రామంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరాయి. శుక్రవారం స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. కొండపై కొలువుదీరిన స్వామివారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.