నక్సలైట్ల పేరుతో కోవూరు MLAకు వార్నింగ్ లెటర్

NLR: కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వార్నింగ్ లెటర్ రావడం కలకలం రేపుతోంది. ఈనెల 17న ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటి వాచ్‌మెన్‌కు లెటర్ ఇచ్చి వెళ్లిపోయాడు. 'రూ. 2కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా' అని అందులో రాసి ఉంది. దీంతో అతను భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, రహస్యంగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.