VIDEO: మూడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపు
HNK: ఐనవోలు మండలం పెరుమల్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దుప్పెల్లి రాకేష్ మూడు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో రాకేష్ గెలుపు ఖరారవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గ్రామంలో పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.