జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మల్టీజోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ఉత్తర్వుల మేరకు కోరుట్ల సీఐ సురేష్ బాబు మెట్‌పల్లికి బదిలీ అయ్యారు. మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్‌ను హైదరాబాద్ మల్టీజోన్-1 ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కరీంనగర్ కమిషనరేట్ జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణను కోరుట్ల సర్కిల్ సీఐగా నియమించారు.