నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో B.Tech, Diploma, B.Sc, B.Com చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు Application Developer – Web & Mobile కోర్సులో ఉచిత శిక్షణను పెడనలోని స్కిల్ హబ్‌లో అందించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆదివారం తెలిపారు. యువత ఐటి శిక్షణ కోసం నగరాలకు వెళ్లే అవసరం లేకుండా, పెడనలోనే ఐటి కోర్సులను ఉచితంగా అందిస్తున్నామన్నారు.