నగరంలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం

నగరంలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం

GNTR: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని పూలే విగ్రహం వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పూలే సేవలను స్మరించుకొని పుష్పాంజలి ఘటించారు. సమాజానికి సమాన హక్కులు కోసం పూలే పోరాటం చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.