కొట్టుకుపోయిన రోడ్డు.. భక్తుల ఇబ్బందులు

RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కాకునూరు గ్రామ శివారులో మహాలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు ఆరోపిస్తున్నారు. నేడు వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తారని, అయితే గుడికివెళ్లే మార్గంలో ఉన్నరోడ్డు కొట్టుకుపోయి కల్వర్టు మాత్రమే మిగిలిందని వాపోతున్నారు. కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు.