VIDEO: బిక్కనూరులో అర్ధరాత్రి వర్షం.. తడిసిన వరి ధాన్యం

VIDEO: బిక్కనూరులో అర్ధరాత్రి వర్షం.. తడిసిన వరి ధాన్యం

KMR: బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు అకాల వర్షం కురవడంతో రైతులు రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యపు కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.